ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త కరోనా వైరస్.. స్ర్టెయిన్‌తో డేంజర్ అంటున్న సైంటిస్టులు..

|

Dec 25, 2020 | 5:43 PM

ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్-19తో జనం అలకల్లోలం అవుతుంటే, తాజాగా కొత్త వైరస్ కంగారుపెడుతోంది. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది. అతివేగంగా వ్యాప్తి చెందుతూ మరణమృదంగం మోగిస్తోంది. ఎటు చూసినా కరోనా స్ట్రెయిన్‌ తిక్కరేపుతోంది. బ్రిటన్‌, సౌతాఫ్రికా సహా పలు దేశాల్లో వైరస్‌ తిష్టవేసింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త కరోనా వైరస్.. స్ర్టెయిన్‌తో డేంజర్ అంటున్న సైంటిస్టులు..
Follow us on

ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్-19తో జనం అలకల్లోలం అవుతుంటే, తాజాగా కొత్త వైరస్ కంగారుపెడుతోంది. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది. అతివేగంగా వ్యాప్తి చెందుతూ మరణమృదంగం మోగిస్తోంది. ఎటు చూసినా కరోనా స్ట్రెయిన్‌ తిక్కరేపుతోంది. బ్రిటన్‌, సౌతాఫ్రికా సహా పలు దేశాల్లో వైరస్‌ తిష్టవేసింది.

ప్పుడు చైనా…ఇప్పుడు బ్రిటన్‌. వైరస్‌ ఒక్కటే. కానీ..ఇప్పటికే ఈ మహమ్మారి వందకుపైగా రూపాంతరం చెందింది. ఒక్కో దేశంలో ఒక్కో మాదిరగా విరుచుకుపడుతోంది. బ్రిటన్‌లో పరివర్తనం చెందిన కరోనావైరస్‌…యమా డేంజర్‌ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్‌ కంటే ..కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ 56 శాతం ఎక్కువ డేంజర్‌ అని గుర్తించారు. అంతేకాదు ఇప్పటివరకూ వైరస్‌ దగ్గు, తుమ్ము ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించేది. అయితే కొత్త స్ర్టెయిన్‌ వైరస్‌ అంటువ్యాధి లక్షణాలు కలిగి ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. అందుకే ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలో తేలింది.

నవంబర్‌లో ఇంగ్లాండ్‌లో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ ..వేగంగా వ్యాపించింది. వైరస్‌ను నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా…పాజిటివ్‌ కేసులు పెరిగాయి. కఠిన ఆంక్షలు, చివరకు లాక్‌డౌన్‌ కూడా పనిచేయలేదు. దీనికి వెంటనే అడ్డుకట్ట వేయకపోతే ప్రపంచ వ్యాప్తంగా భారీగా మరణాలు సంభవించే అవకాశం ఉందని లండన్‌ ఆఫ్‌ హైజీన్‌లోని సెంటర్‌ ఫర్‌ మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ డీసీజెస్‌ తెలిపింది. కోవిడ్‌ -19 కన్నా…కోవిడ్‌ -21 చాలా డేంజర్‌ అని స్పష్టం చేసింది.

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌లో కరోనా స్ట్రెయిన్‌ వాల్డ్‌వైజ్‌ వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గతంలో చైనా నుంచి వ్యాపించిన కరోనా కారణంగా 1.7 మిలియన్లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అంతకంటే వేగంగా 70శాతం ఎక్కువ వ్యాప్తి చెంది ..మరణమృందంగం మోగిస్తుందని స్పష్టం చేశారు. అందుకే అనేకదేశాలు బ్రిటన్‌కు రాకపోకలు నిలిపివేశాయి. అయినప్పటికీ …ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. త్వరలో ప్రపంచమంతా డేంజర్‌ బెల్‌ మోగించనుంది. వ్యాక్సిన్‌ ఉందని ఒకింత ఉపశమనం కలిగిస్తున్నా…భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదువుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత యూకే నుండి భారత్‌కు రాకపోకలు పెరిగాయి. బ్రిటన్‌లో కరోనా కంట్రోల్‌లోకి రాలేదు. ఇటీవల అక్కడి కరోనా కొత్త వైరస్‌తో ఆస్పత్రులకు జనం క్యూ కట్టారు. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రపంచదేశాలన్ని అలెర్ట్‌ అయియాయి. ఆ దేశానికి విమానాల రాకపోకలు రద్దయియాయి. WHO కొత్త వైరస్‌పై చర్చించింది. ఇది యమా డేంజర్‌ అని తెలియడంతో ప్రపంచదేశాలను మరోసారి హెచ్చరించింది. అయితే అప్పటికే ఆయా దేశాల్లో బ్రిటన్‌ వైరస్‌ పాగా వేసింది.

భారత్‌లోనూ బ్రిటన్‌ వైరస్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. ప్రతి రాష్ట్రంలో వైరస్‌ జాడలు కనిపిస్తున్నాయి. కొందరికి పాజిటివ్‌ రావడంతో మరింత అలెర్ట్‌ అయియారు అధికారులు. రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లెన్స్‌ జారీ చేసింది. స్ట్రెయిన్‌ పట్ల మునుపటికన్నా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎక్కువ మరణాలు సంభవించకుండా వేగంగా ప్రజలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని వైద్య నిపుణులు సూచించారు.