COVID-19: ఎస్ఐ సహా 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. పోలీస్‌స్టేషన్ సీజ్.. ఎక్కడంటే..?

|

May 23, 2021 | 6:01 AM

Policemen tests COVID-19 Positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్, ప్రముఖుల వరకూ అందరూ

COVID-19: ఎస్ఐ సహా 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. పోలీస్‌స్టేషన్ సీజ్.. ఎక్కడంటే..?
Police
Follow us on

Policemen tests COVID-19 Positive: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్, ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారినపడుతున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఈ కరోనా పోరులో పోలీసులు కూడా తీవ్రమైన కృషిచేస్తున్నారు. ఓవైపు చట్టాన్ని కాపాడటంతోపాటు.. మరోవైపు మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్, కర్ఫ్యూను సమర్ధవంతంగా అమలుచేస్తున్నారు. అయితే.. ఈ పోరులో చాలామంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు పెద్ద ఎత్తున కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 10 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఎస్ఐ సైతం ఉన్నారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి శానిటైజేషన్ చర్యలు చేపట్టారు.

అయితే.. ఒకరికి స్వల్ప లక్షణాలు కనిపించగా.. టెస్ చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం అందరూ పరీక్షలు చేయించుకున్నారు. ఈక్రమంలో ఒకేసారి స్టేషన్లో పది మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో అంతా బెంబేలెత్తిపోయారు. ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ సీజ్ చేశారు. అయితే.. వైరస్ సోకిన వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అనంతరం పలు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Black Fungus: చిన్న ప్రేగులకు బ్లాక్ ఫంగస్.. వెల్లడించిన గంగారామ్ ఆసుపత్రి వైద్యులు..

Cyclone Tauktae: నేనేమీ హెలికాప్టర్‌లో ఉండి ఫొటో సెషన్ నిర్వహించలేదు.. బీజేపీ నేతలపై సీఎం ఉద్ధవ్ ఫైర్