కరోనా వైరస్ ఎఫెక్ట్..10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న ఇండిగో విమాన సంస్థ

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 7:47 PM

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండిగో విమాన సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సిబ్బందిలో సుమారు 10 శాతాన్ని తగ్గించుకుంటున్నట్టు ఈ సంస్థ సీఈఓ రంజన్ దత్తా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను..

కరోనా వైరస్ ఎఫెక్ట్..10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న ఇండిగో విమాన సంస్థ
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండిగో విమాన సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సిబ్బందిలో సుమారు 10 శాతాన్ని తగ్గించుకుంటున్నట్టు ఈ సంస్థ సీఈఓ రంజన్ దత్తా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రతను తాము గమనించామని, కరోనా వైరస్ ని నియంత్రించే క్రమంలో ప్రభుత్వం విధించిన ఆంక్షల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. తప్పనిసరిగా మేము మా ప్రణాళికలను సవరించుకోవలసి వచ్చింది అని చెప్పారు. ఉద్యోగుల లే ఆఫ్ తప్పడంలేదన్నారు.  వేతనాల్లో కోత, వేతనం లేకుండా నిర్బంధ సెలవు వంటి చర్యలు తీసుకున్నా అవి చాలలేదని ఆయన చెప్పారు. ఇండిగో సంస్థలో 23 వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఇటీవల ఎయిరిండియా కూడా తమ ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.