ఆ ప్రైవేటు ల్యాబులకు టీ సర్కార్ నోటీసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తూ ప్రతాపం చూపుతోంది. పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గుబులురేపుతోంది. మరోవైపు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. జంటనగరాల పరిధిలో..

ఆ ప్రైవేటు ల్యాబులకు టీ సర్కార్ నోటీసులు

Updated on: Jul 04, 2020 | 4:40 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తూ ప్రతాపం చూపుతోంది. పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య గుబులురేపుతోంది. మరోవైపు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. జంటనగరాల పరిధిలో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు ఊపిరాడనివ్వడం లేదు. దీంతో చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్ల బాటపట్టారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటివరకు 16,078 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇటువంటి తరుణంలో ప్రైవేటు ల్యాబులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ టెస్టులు చేస్తున్న ప్రైవేటు ల్యాబ్స్‌ తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని సర్కార్ సీరియస్ అవుతోంది. తెలంగాణలోని ప్రైవేటు ల్యాబులు తప్పులు సరిదిద్దుకోకుంటే మూసివేస్తామంటూ వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులు చేస్తున్నారని వివరించిన వైద్య ఆరోగ్య శాఖ డీహెచ్…13 ల్యాబుల్లో అసాధారణ రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. అటు తెలంగాణలో రికవరీ శాతం చాలా ఎక్కువగా ఉంటోందని, ఎవరూ భయపడక్కర్లేదని అన్నారు. ఇక వచ్చే వారం నుండి టీమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us