కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. అన్నీ అక్కడే..!

| Edited By:

May 11, 2020 | 10:04 PM

తెలంగాణలో మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కరోనా కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 79 కేసులు నమోదు కాగా.. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇక ఇప్పటివరకు 801 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. ప్రస్తుతం 444 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 50 మంది డిశ్చార్జ్ అయ్యారు. వారిలో హైదరాబాద్‌ నుంచి 42 మంది , సూర్యాపేట నుంచి […]

కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. అన్నీ అక్కడే..!
Follow us on

తెలంగాణలో మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కరోనా కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 79 కేసులు నమోదు కాగా.. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇక ఇప్పటివరకు 801 మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. ప్రస్తుతం 444 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు 50 మంది డిశ్చార్జ్ అయ్యారు. వారిలో హైదరాబాద్‌ నుంచి 42 మంది , సూర్యాపేట నుంచి నలుగురు, నిర్మల్ నుంచి 1, అసిఫాబాద్ నుంచి 1, మేడ్చల్‌ నుంచి 1, కరీంనగర్‌ జిల్లా నుంచి ఒకరు ఉన్నారు. ఇక రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 30గా ఉంది. కాగా ప్రధాని మోదీతో ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని కోరిన విషయం తెలిసిందే. రైళు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం కష్టమని ఆయన అన్నారు.

Read This Story Also: Breaking: ఏపీలో హోమ్ క్వారంటైన్‌లో 10 మంది ఆర్టీసీ డ్రైవర్లు