తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో ఈ రోజు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 317 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,84,391 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,529 మంది మరణించారు. తాజాగా కరోనాతో 536 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,76,244 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,618 ఉండగా, హోం ఐసోలేషన్ లో 4,535 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాత ఉండగా, దేశంలో 1.4 శాతం ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.13 శాతం ఉండగా, దేశంలో 95.8 శాతం ఉంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులున్నాయి.