Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్(COVID-19)వ్యాప్తి కొనసాగుతోంది. కానీ గతంలో కంటే కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 865 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా(CORONA) కేసుల సంఖ్య 7,80,836 కాగా, మరణాల సంఖ్య 4,103గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,56,883 ఉండగా, తాజాగా 2,484 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.93 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 19,850 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, ఇవాళ మొత్తం 61,573 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,27,86,560 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 263 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
ఇవి కూడా చదవండి: Statue of Equality: మన సమాజంలో శాస్త్రం.. శస్త్రం రెండు ఉండాలి.. రామనగరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
Dera Politics in Punjab: ఎన్నికల వేళ డేరా చీఫ్ రామ్ రహీం విడుదల.. పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు..!