తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం

నిన్నటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సకల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతించారు. ఇందులో భాగంగా..

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం

Updated on: Sep 08, 2020 | 6:54 PM

నిన్నటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సకల ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని కరోనా నెగిటివ్ వచ్చిన వాళ్లని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతించారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ టెస్టులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో అసెంబ్లీలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు. వాళ్లందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us