తెలంగాణలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 164 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే..

Edited By:

Updated on: Jun 12, 2020 | 10:25 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 164 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4484కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇక శుక్రవారం నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకుని 2278 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ప్రస్తుతం 2032 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.