కరోనా విలయం: 121 మంది చిన్నారులకు కోవిడ్

తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృభిస్తోంది. మంగళవారం 121 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య  2,058 మందికి చేరాయి. వీరిలో 1272 మంది పురుషులు కాగా.. 665 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇప్పటివరకూ మృతుల..

కరోనా విలయం: 121 మంది చిన్నారులకు కోవిడ్

Edited By:

Updated on: Apr 29, 2020 | 12:39 PM

తమిళనాడులో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మంగళవారం 121 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య  2,058 మందికి చేరాయి. వీరిలో 1272 మంది పురుషులు కాగా.. 665 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇప్పటివరకూ మృతుల సంఖ్య 25కి చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కరోనా వైరస్ సోకిన వారిలో 121 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరంతా 12 ఏళ్ల లోపు వారని అధికారులు వివరించారు.

అలాగే తమిళనాడు రాజధాని చెన్నైలో 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిటీలో మొత్తం కేసుల సంఖ్య 673కి చేరింది. కాగా కోయంబత్తూరులో 141, తిరుప్పూర్‌లో 112, దిండిగల్‌లో 80, మధురైలో 79, ఈరోడ్‌లో 70, తిరునల్వేలిలో 63, చెంగల్పట్టులో 70, నామక్కల్‌లో 61 మందికి కరోనా నిర్థారణ అయ్యినట్టు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి నివారణకు చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుప్పూర్, సేలం నగరాల్లో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ తమిళ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read More: 

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

భారత్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు