దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 28 వేలకు చేరిన మరణాలు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండున్నర లక్షలు దాటింది. ఇక కరోనా బారినపడి..

దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 28 వేలకు చేరిన మరణాలు..

Updated on: Jul 21, 2020 | 9:30 AM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండున్నర లక్షలు దాటింది. ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 28వేలకు చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,148 కరోనా పాజిటివ్
కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,171కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 7,24,578 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 587 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 28,084 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, దేశ వ్యాప్తంగా 20వ తేదీ వరకు 1,43,81,303 కరోనా టెస్టులు చేశారు. వీటిలో 3,33,395 పరీక్షలు సోమవారం నాడు చేసినవే. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ప్రకటించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us