Akhilesh Yadav Covid-19 positive : మాజీ ముఖ్యమంత్రి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్లో అభ్యర్థన

Akhilesh Yadav : సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కరోనా బారిన పడ్డారు.

Akhilesh Yadav Covid-19 positive : మాజీ ముఖ్యమంత్రి.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్లో అభ్యర్థన

Updated on: Apr 14, 2021 | 2:14 PM

SP chief Akhilesh Yadav tests COVID-19 positive :  సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ఫలితంగా సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నానని చెప్పారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్నవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నానని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు, వాళ్లంతా కొన్ని రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆయన అభ్యర్థించారు. కాగా, ఇటీవలే హరిద్వార్ లోని మహాకుంభమేళాలో అఖిలేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా, కుంభమేళా ప్రాంతంలోని కరోనా క్యాంపుల్లో  చేసిన టెస్టుల్లో గత రెండు రోజుల్లో వెయ్యిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం విశేషం.  ఇలాఉండగా, దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కేసుల సంఖ్య కొత్త రికార్టులకు చేరుతోంది. ఉత్తర ప్రదేశ్ తోపాటు, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా అనేక చోట్ల రాత్రి నుంచి కరోనా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అటు, పలు రాష్ట్రాల్లో అనేకమంది రాజకీయ ప్రముఖులు కరోనా మహమ్మారికి చిక్కుతున్నారు. తాజా సమాచారం ప్రకారం యూపీ మినిస్టర్ అశుతోష్ టాండన్ కూడా కరోనా బారిన పడ్డారు.

Read also : Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..