నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వే

| Edited By:

Aug 26, 2020 | 10:10 AM

కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సీరో సర్వైలెన్స్‌ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలు కానుంది. ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వే
Follow us on

కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సీరో సర్వైలెన్స్‌ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలు కానుంది. ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇప్పటికే తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వైలెన్స్‌ నిర్వహించారు. ఈ సర్వే లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు లేకున్నా కోవిడ్19 టెస్టులలో పాజిటివ్‌గా వస్తున్నట్లు తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వేలో తేలింది.

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 99.5 శాతం కరోనా పేషెంట్లలో, కృష్ణాలో 99.4శాతం, నెల్లూరులో 96.1 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి కరోనా లక్షణాలు లేకున్నా కోవిడ్19 టెస్టులలో పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 22 శాతం మందికి కరోనా వచ్చినా.. కోవిడ్10 యాంటీబాడీస్ వృద్ధి చెందడంతో వారికి తెలియకుండానే వైరస్ బారి నుంచి బయటపడ్డారని సీరో సర్వైలెన్స్ సర్వేలో గుర్తించారు.

ప్రతి జిల్లాలో సేకరించిన 5 వేల నమూనాల్లో వెయ్యింటిని కేవలం హైరిస్కు ప్రాంతాల్లో చేస్తారు. మిగతా 4వేల నమూనాలు 60 శాతం కంటైన్మెంట్‌ జోన్‌లోనూ, 40 శాతం నాన్‌ కంటైన్మెంట్‌ జోన్‌లలోనూ నిర్వహిస్తారు. ఈ జోన్లలో 30 శాతం అర్బన్‌ ప్రాంతాల్లోనూ, 60 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు. అర్బన్‌లో 3 వార్డులు, రూరల్‌లో 16 గ్రామాల్లో ఈ నమూనాలు సేకరిస్తారు. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్‌లో 30 శాతం అర్బన్, 70 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు. ఇందులో అర్బన్‌లో 2 వార్డులు, రూరల్‌లో 8 గ్రామాలు ఉంటాయి.

కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా తేలిన వారిని 10 రోజులపాలు హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఈ వ్యవధిలో జ్వరం, తలనొప్పి, జలుబు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులు పరిశీలించిన అనంతరం మందులు ఇస్తారు. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా లక్షణాలు లేని బాధితులు త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.