
కరోనా మహమ్మారి దేశంలో అన్ని విభాగాల వారిని తాకుతోంది. తాజాగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల కేరళలో తొమ్మిది మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి కన్నూర్ జిల్లాలో చికిత్స అందిస్తున్నారు. అయితే వీరికి అందుతున్న ట్రీట్మెంట్‌తో పాటు.. పరిస్థితులను గమనించేందుకు ఏకంగా సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారి రంగంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని కేరళ డీజీపీ లోక్‌నాథ్ బోహరా తెలిపారు. కన్నూర్‌లో చికిత్స పొందుతున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పరామర్శించేందుకు ఆయన రానున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీజీపీ తెలిపారు. వీరిద్దరూ కన్నూర్ లోని ఎయిర్ పోర్టును, సీఐఎస్ఎఫ్ బరాక్స్‌ను సందర్శించనున్నారు.
మరోవైపు కేరళలో అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే నాలుగ వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. రెండు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.