రష్యాలో పెరుగుతున్న కరోనా కేసుల.. అది కూడా లక్షణాలు లేకుండానేనట

| Edited By:

Aug 08, 2020 | 3:01 AM

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా అదుపులోకి వస్తుందనుకున్నప్పటికీ.. నిత్యం ఐదువేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా..

రష్యాలో పెరుగుతున్న కరోనా కేసుల.. అది కూడా లక్షణాలు లేకుండానేనట
Follow us on

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా అదుపులోకి వస్తుందనుకున్నప్పటికీ.. నిత్యం ఐదువేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా కొత్తగా మరో 5,241 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,77,135కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 6,83,592 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని రష్యన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో కూడా.. లక్షణాలు లేకుండానే ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మాస్కో నగరంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం రెండు వందలకు లోగా కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా కరోనా బారినపడి 14,725 మంది మరణించారు.

 

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే