వలస కూలీలకు రూ. 7,500 ఇవ్వాలి: రాహుల్

|

May 13, 2020 | 3:47 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ ప్రభుత్వం వారి కష్టాలను అసలు పట్టించుకోవట్లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వారి పట్ల సానుభూతి చూపించాలని కోరారు. అంతేకాకుండా వలస కూలీల బ్యాంక్ అకౌంట్లలోకి రూ. 7,500 జమ చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా, జాతినుద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో వలస కూలీల గురించి మోదీ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ తెలిపింది. మరోవైపు లాక్ డౌన్ […]

వలస కూలీలకు రూ. 7,500 ఇవ్వాలి: రాహుల్
Follow us on

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ ప్రభుత్వం వారి కష్టాలను అసలు పట్టించుకోవట్లేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వారి పట్ల సానుభూతి చూపించాలని కోరారు. అంతేకాకుండా వలస కూలీల బ్యాంక్ అకౌంట్లలోకి రూ. 7,500 జమ చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా, జాతినుద్దేశించి ఇచ్చిన ప్రసంగంలో వలస కూలీల గురించి మోదీ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ తెలిపింది.

మరోవైపు లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు కాలి నడకన తమ స్వస్థలాలకు వెళ్ళేటప్పుడు కొన్ని విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి వలస కూలీలను జాగ్రత్తగా స్వస్థలాలకు చేరుస్తోంది.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!