కరోనాపై యుద్ధానికి నేను సైతం అంటున్న రాఘవ లారెన్స్..

| Edited By:

Apr 10, 2020 | 9:16 PM

ప్రముఖ సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ కరోనాపై యుద్ధానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు. ఇక ఫెఫ్సీతో పాటు..డ్యాన్సర్ల యూనియన్‌కు మరో రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. అంతేగాక.. లారెన్స్‌ సంరక్షణలో ఉన్న దివ్యాంగులకు రూ.25లక్షలు.. తమిళనాడులోని తన సొంత గ్రామం రాయపురం ప్రాంతంలో.. రోజువారి కూలీలకు, పేదలకు.. […]

కరోనాపై యుద్ధానికి నేను సైతం అంటున్న రాఘవ లారెన్స్..
Follow us on

ప్రముఖ సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ కరోనాపై యుద్ధానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు. ఇక ఫెఫ్సీతో పాటు..డ్యాన్సర్ల యూనియన్‌కు మరో రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. అంతేగాక.. లారెన్స్‌ సంరక్షణలో ఉన్న దివ్యాంగులకు రూ.25లక్షలు.. తమిళనాడులోని తన సొంత గ్రామం రాయపురం ప్రాంతంలో.. రోజువారి కూలీలకు, పేదలకు.. నిత్యవసర సరకులు, ఆహారం కోసం.. రూ.75 లక్షలను అందించనున్నట్లు ప్రకటించారు.
కాగా.. ఈ విరాళం మొత్తాన్ని తాను రజినీకాంత్‌తో కలిసి చేయబోయే సినిమా నుంచి ఇస్తున్నట్లు రాఘవా లారెన్స్‌ ప్రకటించారు. మరోవైపు సినీ పరిశ్రమ నుంచి అనేక మంది ఇప్పటికే కరోనాపై యుద్ధానికి వారి వంతు సాయంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు.. ఆర్ధిక సహాయాన్ని కూడా చేస్తున్నారు.