కవలలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

| Edited By:

Jul 31, 2020 | 8:36 PM

కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ గర్భిణి శుక్రవారం కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణె మున్సిపల్‌ కార్పోరేషన్‌లోని సోనావనే ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఓ గర్భిణికీ..

కవలలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు
Follow us on

కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ గర్భిణి శుక్రవారం కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణె మున్సిపల్‌ కార్పోరేషన్‌లోని సోనావనే ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఓ గర్భిణికీ ఇటీవల కరోనా వచ్చింది. దీంతో ఆమె పూణెలోని సోనావనే ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. త‌ల్లీ, ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు తెలిపారు. అయితే పుట్టిన కవలలకు కరోనా సోకిందా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి