Breaking News : క‌రోనాతో తెలుగు నిర్మాత కన్నుమూత

Producer Pokuri Ramarao Died : టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూశారు. ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు అభ్యుదయవాదంతో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఘనత రామారావుకు చెందుతుంది. కరోనా సోకడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు రామారావు సమర్పకుడిగా […]

Breaking News : క‌రోనాతో తెలుగు నిర్మాత కన్నుమూత

Edited By:

Updated on: Jul 04, 2020 | 12:20 PM

Producer Pokuri Ramarao Died : టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూశారు. ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు అభ్యుదయవాదంతో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఘనత రామారావుకు చెందుతుంది. కరోనా సోకడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది. ఈతరం ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు అందించారు.

కరోనాతో ప్రపంచం మొత్తం భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… మహమ్మారి వ్యాప్తికి అడ్డకట్ట వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కరోనా రక్కసికి చిక్కుతున్నారు.