బ్రిటన్ రాజవంశీయుడు 71 ఏళ్ళ ప్రిన్స్ ఛార్లెస్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. చార్లెస్, కెమిల్లా ఇద్దరూ ఎందుకైనా మంచిదని స్కాట్లాండ్ లోని ఓ టౌన్ లో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారని ఆ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎవరి నుంచి కరోనా పాజిటివ్ లక్షణాలు చార్లెస్ కి సోకాయో తెలియడంలేదు. గత వారం రోజుల్లో ఆయన మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ తో సహా అనేకమందితో భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రిన్స్ ఆల్బర్ట్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. చార్లెస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇంతకూ మించి వివరాలు వెల్లడించడానికి ఆ అధికార ప్రతినిధి నిరాకరించారు.