కరోనా భయం.. స్పిరిట్యువల్ ఈవెంట్ రద్దు చేసుకున్న పోప్ ఫ్రాన్సిస్

| Edited By: Pardhasaradhi Peri

Mar 02, 2020 | 4:52 PM

ఇరాన్, ఇటలీ తదితర దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు వాటికన్ సిటీని కూడా తాకినట్టు కనిపిస్తోంది. ఇక్కడ పోప్ ఫ్రాన్సిస్ విపరీతమైన దగ్గు, జలుబుతో బాధ పడుతుండడంతో తాను పాల్గొనవలసిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

కరోనా భయం.. స్పిరిట్యువల్ ఈవెంట్ రద్దు చేసుకున్న పోప్ ఫ్రాన్సిస్
Follow us on

ఇరాన్, ఇటలీ తదితర దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు వాటికన్ సిటీని కూడా తాకినట్టు కనిపిస్తోంది. ఇక్కడ పోప్ ఫ్రాన్సిస్ విపరీతమైన దగ్గు, జలుబుతో బాధ పడుతుండడంతో తాను పాల్గొనవలసిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రోమ్ సమీపంలోని ఈ వాటికన్ సిటీలో ఓ పోప్ ఈ విధమైన  కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి. 83 ఏళ్ళ పోప్ ఫ్రాన్సిస్ 2013 లోనే ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు.

అటు-ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని ఆయన చివరి క్షణంలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. సెయింట్ పీటర్స్ బెర్గ్ లో  ఈ కార్యక్రమం తొలిసారిగా పోప్ లేకుండానే జరిగింది. దురదృష్టవశాత్తూ  తన అస్వస్థత కారణంగా ఈ ఏడాది రీట్రీట్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని, తాను ఉన్నచోటి నుంచే ప్రసంగాలు చేస్తానని ఫ్రాన్సిస్ చెప్పారు. అయితే ఆయన మాట్లాడుతున్నంతసేపు దగ్గుతూనే ఉన్నారట. ఇలా ఉండగా.. ఇటలీలో 1100 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 29 మంది మరణించారు. హఠాత్తుగా పోప్ అనారోగ్యంబారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.