‘మా రాష్ట్రానికి ఆ బృందాలెందుకు ?’ దీదీ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Apr 20, 2020 | 7:39 PM

పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం నీరు గారుస్తోందని, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వఛ్చిన వార్తలపై కేంద్రం సీరియస్ అయింది. కోల్ కతా తో బాటు ఏడు జిల్లాలకు  రెండు జట్లుగా అంతర్ మంత్రుల బృందాలను పంపింది. ఈ బృందాలు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన, తాజా పరిస్థితిపై హోమ్ శాఖకు నివేదికలు సమర్పించనున్నాయి. కేంద్రం చర్యపై మండిపడిన సీఎం మమతా బెనర్జీ.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రధాని మోదీని, […]

మా రాష్ట్రానికి ఆ బృందాలెందుకు ? దీదీ ఫైర్
Follow us on

పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం నీరు గారుస్తోందని, నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వఛ్చిన వార్తలపై కేంద్రం సీరియస్ అయింది. కోల్ కతా తో బాటు ఏడు జిల్లాలకు  రెండు జట్లుగా అంతర్ మంత్రుల బృందాలను పంపింది. ఈ బృందాలు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన, తాజా పరిస్థితిపై హోమ్ శాఖకు నివేదికలు సమర్పించనున్నాయి. కేంద్రం చర్యపై మండిపడిన సీఎం మమతా బెనర్జీ.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షా ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మీరు చెప్పకపోతే ఈ బృందాలకు ప్రభుత్వం సహకరించబోదని హెచ్చరించారు. సరైన కారణాలు లేనిదే ఈ విధమైన నిర్ణయాలు ఫెడరలిజానికి గొడ్డలిపెట్టని ఆమె పేర్కొన్నారు.  దీదీ ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. ఢిల్లీలో చీఫ్ సెక్రటరీ రాజీవ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. రెండు బృందాలు పశ్చిమ బెంగాల్ లో అప్పుడే దిగాయన్నారు. ఒకటి జల్పాయ్ గురిలో, మరొకటి కోల్ కతా లో దిగాయని, త్వరలో ఇవి తమ రిపోర్టులను సమర్పిస్తాయని ఆయన వెల్లడించారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ బెంగాల్ లో స్వీట్, పాన్, పూల మార్కెట్ల ప్రారంభానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చిన సంగతి విదితమే.