కరోనా వైరస్ సోకిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల

|

Dec 23, 2020 | 10:10 PM

కరోనా వైరస్ సోకిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.

కరోనా వైరస్ సోకిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల
Follow us on

కరోనా వైరస్ సోకిన వారు టీకా తప్పనిసరిగా తీసుకోవాలని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా సీఐఐ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ మీటింగ్‏లో ఆయన పాల్గొన్నారు. వైరస్ సోకిన వారు టీకా తీసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. వైరస్ సోకినవారు టీకా తీసుకోవాలని తెలిపారు. కరోనా సోకిన వారిలో టీ కణాల ప్రతిస్పందన సాధ్యమైనంతగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం వారు టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి తెలిపారు.

అటు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 24 కేంద్రాల్లో ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు. టీకా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి 3 నగరాలను ఎంచుకున్నట్లు తెలిపారు. అటు ఈ కార్యక్రమంలో బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందర్ షా కూడా పాల్గొన్నారు.