టీటీడీ అనుబంధ ఆలయాల్లో కలకలం పుట్టిస్తోన్న కరోనా..

టీటీటీ అనుబంధ ఆలయాల్లో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయంలో పనిచేసే పోటు వర్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆలయ పరిసర ప్రాంతాలను..

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కలకలం పుట్టిస్తోన్న కరోనా..

Edited By:

Updated on: Jul 19, 2020 | 11:30 AM

టీటీటీ అనుబంధ ఆలయాల్లో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయంలో పనిచేసే పోటు వర్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆలయ పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేశారు సిబ్బంది. అలాగే పాజిటివ్ వచ్చిన వర్కర్‌ని క్వారంటైన్‌కు పంపించారు. పోటు వర్కర్‌తో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు. అలాగే ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని సమాచారం.

కాగా నిన్న శ్రీనివాస మంగాపురం ఆలయంలో రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆలయాన్ని మూసివేశారు అధికారులు. మిగిలిన అర్చకులు, పోటు, ఇతర సిబ్బంది కరోనా టెస్టులు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక గత నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి