ఇక మాస్క్‌ పెట్టుకోకపోతే అంతే.. ఆరు నెలలు జైలుకే..

| Edited By:

Jul 21, 2020 | 9:57 AM

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడుకు చెందిన నీలగిరి కలెక్టర్ ఇన్ఫోసిస్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నీలగిరి జిల్లాలో ఎవరైనా మాస్క్‌ ధరించకుండా బయట తిరిగితే ఆరు..

ఇక మాస్క్‌ పెట్టుకోకపోతే అంతే.. ఆరు నెలలు జైలుకే..
Follow us on

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడుకు చెందిన నీలగిరి కలెక్టర్ ఇన్ఫోసిస్ దివ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నీలగిరి జిల్లాలో ఎవరైనా మాస్క్‌ ధరించకుండా బయట తిరిగితే ఆరు నెలల పాటు జైక్ష విధించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పర్యాటక స్థలాలైన ఊటీ,కన్నూర్,కొడనాడు ప్రాంతాలను ఇప్పటి అధికారులు మూసేవేశారు. జిల్లాలో గడిచిన నాలుగు రోజుల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.