Strain Virus: నెల్లూరులో కలకలం.. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి స్ట్రెయిన్ పాజిటివ్‌గా నిర్ధారణ…

| Edited By:

Dec 27, 2020 | 1:32 PM

నెల్లూరు జిల్లాలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కలకలం స‌ృష్టిస్తోంది. బ్రిటన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 46 మంది వచ్చినట్లు వైద్య శాఖ అధికారులు తెలుపుతున్నారు.

Strain Virus: నెల్లూరులో కలకలం.. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి స్ట్రెయిన్ పాజిటివ్‌గా నిర్ధారణ...
Follow us on

నెల్లూరు జిల్లాలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కలకలం స‌ృష్టిస్తోంది. బ్రిటన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 46 మంది వచ్చినట్లు వైద్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాగా, యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. సదరు వ్యక్తికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతడికి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల మాదిరిగానే లక్షణాలున్నాయని స్పష్టం చేశారు.

 

విదేశాల నుంచి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించారు. జిల్లాకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉండటంతో అక్కడ 24 గంటల హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేశామని అన్నారు. నెల్లూరు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తున్నామని తెలిపారు. ఏ మాత్రం అనుమానిత లక్షణాలు ఉన్నా వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నామని అన్నారు. జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. కాగా, ఇప్పటికే యూకే నుంచి వచ్చిన 46 మందిని గుర్తించామని, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను కూడా గుర్తించామని తెలిపారు. అందరిని హోం ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించామని అన్నారు.