YCP Rebel MP On Covid Vaccine: వారితో పాటు తొలి ప్రాధాన్యతలో ప్రజాప్రతినిధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి.. ప్రధానికి ఎంపీ లేఖ

| Edited By: Pardhasaradhi Peri

Jan 10, 2021 | 5:28 PM

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధాని మోడీకి లేఖ..

YCP Rebel MP On Covid Vaccine: వారితో పాటు తొలి ప్రాధాన్యతలో ప్రజాప్రతినిధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి.. ప్రధానికి ఎంపీ లేఖ
Follow us on

YCP Rebel MP On Covid Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా బాధితుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వడానికి తొలిప్రాధాన్యత ఇచ్చారు. వైద్య సిబ్బంది, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు దాదాపు మూడు కోట్ల మందికి టీకా ఇవ్వనున్నారు. అయితే వీరితో పాటు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు కూడా తొలిదశలోనే టీకాలు ఇవ్వమని నరసాపురం ఎంపీ కోరారు.

కరోనా వారియర్స్ తర్వాత 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు వయసున్నా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి టీకా ఇవ్వనున్నారు. వీరంతా కలిపి దాదాపు 27 కోట్ల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. అయితే భారతీయ వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Also Read: దేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా అదే క్రేజ్.. షిర్డీలో సోనూ సూద్ కోసం భారీగా తరలివచ్చిన జనం