Sonu Sood Visited Shirdi: దేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా అదే క్రేజ్.. షిర్డీలో సోనూ సూద్ కోసం భారీగా తరలివచ్చిన జనం

సాయం చేయడానికి ఉండాల్సి డబ్బు మాత్రమే కాదు అంతకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే మనసని నిరూపించారు ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి రియల్ హీరో..

Sonu Sood Visited Shirdi: దేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా అదే క్రేజ్.. షిర్డీలో సోనూ సూద్ కోసం భారీగా తరలివచ్చిన జనం
Follow us

|

Updated on: Jan 10, 2021 | 4:52 PM

Sonu Sood Visited Shirdi: సాయం చేయడానికి ఉండాల్సి డబ్బు మాత్రమే కాదు అంతకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే మనసని నిరూపించారు ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి రియల్ హీరో అయ్యారు. ఈ వెండి తెర విలన్. అప్పటి నుంచి మొదలైన ఈ దాతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాము బాధల్లో ఉన్నాం సాయం అందించండి అంటూ అడిగిన వారికీ … తనని సాయం అడగనివారికి సాయం చేస్తూ వారికి అండగా ఉంటూ దేశంలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు.

తాజాగా సోను సూద్ షిరిడీ సాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన రాకతో ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోనూ షిరిడీ వచ్చారనే వార్త తెలియగానే ఆలయం వద్దకు భక్తులతో పాటు.. స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సోనూని చూడగానే ‘రియల్ హీరో’.. ‘లవ్యూ సార్’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సోనూ వారందరికీ కృతఙ్ఞతలు చెప్పారు. ఆలయంలోనుంచి బయటకు వచ్చిన తర్వాత కార్ ఎక్కి అక్కడివారికి అభివాదం చేశారు. ఆ సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హ్యాండ్సప్ సినిమాతో తెలుగు లో అడుగు పెట్టినా.. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అరుంధతి మూవీలో వదల బొమ్మాళి అంటూ పశుపతి పాత్రలో నటించి ఓ రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో సోనూ నటనకుగాను అవార్డులతో పాటు రివార్డు కూడా అందుకున్నారు. తాజాగా సోనూ సూద్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘అల్లుడు అదుర్స్’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆచార్య సెట్ లో సిబ్బందికి 100 సెల్ ఫోన్లు పంచిన సంగతి తెలిసిందే.

Also Read: భారీ హిమపాతంతో శ్వేతవర్ణాన్ని అద్దుకున్న కాశ్మీర్.. అద్భుతమైన వీక్షణం అంటున్న కేంద్ర మంత్రి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..