ప్రపంచాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తోంది కరోనా వైరస్. ఏ మాత్రం కాస్త అశ్రద్ధగా ఉన్నా.. వాళ్లను కబలించేస్తుంది. ఇప్పటికే దీని దెబ్బకు.. లక్షల్లో ప్రజలు మరణించగా.. మరికొన్ని లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దీనికి మందు కనిపెట్టేందుకు.. ప్రపంచ శాస్త్రవేత్తలు, వైద్యులు తలమునకలై శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని రెడీ చేసి ట్రయిల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సముద్రంలో ఉండే నాచుకి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచుతో కరోనాకి చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాచురైడ్‌లు.. శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకొని.. బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. దీంతో.. కరోనా యాంటీ వైరల్ మందులే కాకుండా శానిటరైజ్ వస్తువులపై కూడా వైరస్ చేరకుండా కోటింగ్ వేయవచ్చని తమ రీసెర్చ్ ద్వారా శాస్త్రవేత్తలు తెలియజేశారు. ముందుగా వాటితో గ్రూప్ ఉద్యోగులపై పరీక్షలు చేసి, ఆ తర్వాత మార్కెట్‌లో రిలీజ్ చేయనుందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ