నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు మృతి

కరోనా రక్కసి మనుషుల్లోని మానవత్వాన్ని పూర్తిగా హరించి వేస్తోంది. వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున పడేస్తోంది. బంధాలు, బంధుత్వాలను దూరం చేసేస్తోంది. అన్నింటికీ మించి సాటిమనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాపాడలేని కర్కశులుగా మారుస్తోంది.

నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు మృతి

Updated on: Jul 08, 2020 | 5:11 PM

కరోనా రక్కసి మనుషుల్లోని మానవత్వాన్ని పూర్తిగా హరించి వేస్తోంది. వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున పడేస్తోంది. బంధాలు, బంధుత్వాలను దూరం చేసేస్తోంది. అన్నింటికీ మించి సాటిమనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాపాడలేని కర్కశులుగా మారుస్తోంది. ఇందుకు ప్రత్యక్షంగా నిలిచే సంఘటన ఒకటి హైదరాబాద్ మహానగరంలో బుధవారం వెలుగు చూసింది.

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తాలో నడిరోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలిపోయిన ఘటన అందరినీ కలచివేసింది. మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అతడితో పాటు ఉన్న ఇద్దరు మహిళలు సాయం కోసం ఎంతగా ప్రాధేయపడినా… చుట్టూ ఉన్న వాళ్లు పట్టించుకోని పరిస్థితి. కరోనా కారణంగా సాటి మనిషిని తాకేందుకు మనిషి భయపడుతున్న పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఓ అంబులెన్స్ వచ్చింది. సిబ్బంది అతడిని పరిశీలించగా..అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సదరు యువకుడు జవహర్‌నగర్‌కు చెందిన పృథ్వీగా గుర్తించారు. పృథ్వీ మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. జ్వరం తగ్గకపోవటంతో మరో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఈ దారుణం జరిగిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us