మహారాష్ట్రలో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుంది. ఒక్క రోజు కేసుల నమోదు తగ్గిందనుకున్న సమయంలో.. 24 గంటలు..

మహారాష్ట్రలో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదు

Updated on: Aug 05, 2020 | 11:10 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుంది. ఒక్క రోజు కేసుల నమోదు తగ్గిందనుకున్న సమయంలో.. 24 గంటలు గడవకముందే.. మళ్లీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 10,309 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,68,265కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 6,165 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,05,521కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1,45,961 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ
విషయాన్ని మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 334 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 16,476 మంది మరణించారు. ఇక ముంబై నగరంలోని ధారవిలో మాత్రం కరోనా మమమ్మారి కాస్త అదుపులోకి వస్తుంది.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

Loading...
Unable to load recommendations.
Follow Us