మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే 5 లక్షల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో పోలీసు సిబ్బందిని కూడా కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపు 12 వేల మంది సిబ్బంది వరకు కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 147 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసు సిబ్బంది సంఖ్య 11,920కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 9,569 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి.
147 more policemen found #COVID19 positive in the last 24 hours in Maharashtra, taking the tally to 11,920, including 2,227 active cases, 9,569 recovered cases & 124 deaths of police personnel in the state till date: Maharashtra Police pic.twitter.com/ua4w6pI47y
— ANI (@ANI) August 14, 2020
Read More :