బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే.. కరెంట్ బిల్లు తక్కువొస్తుందట.!

|

May 25, 2020 | 2:00 PM

మధ్యప్రదేశ్‌లోని ఓ వినియోగదారుడు తన ఇంటికి ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందంటూ విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ ఉన్న అధికారులు చెప్పిన సమాధానానికి అతడు ఖంగుతిన్నాడు. ‘అతి తక్కువ(రూ.100) కరెంట్ బిల్లు రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం గద్దె దింపి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటూ’ సలహా ఇచ్చారు. అగర్ మాల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్ అనే వినియోగదారుడు విద్యుత్‌ శాఖ నుంచి రూ 30,000కు పైగా బిల్లు వచ్చిందని మధ్య ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ […]

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే.. కరెంట్ బిల్లు తక్కువొస్తుందట.!
Follow us on

మధ్యప్రదేశ్‌లోని ఓ వినియోగదారుడు తన ఇంటికి ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందంటూ విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ ఉన్న అధికారులు చెప్పిన సమాధానానికి అతడు ఖంగుతిన్నాడు. ‘అతి తక్కువ(రూ.100) కరెంట్ బిల్లు రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం గద్దె దింపి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలంటూ’ సలహా ఇచ్చారు.

అగర్ మాల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్ అనే వినియోగదారుడు విద్యుత్‌ శాఖ నుంచి రూ 30,000కు పైగా బిల్లు వచ్చిందని మధ్య ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెబ్ సైట్‌లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు తన కంప్లయింట్ ఏమైందని చెక్ చేయగా.. ‘తక్కువ కరెంట్ బిల్లు రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దింపి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించాలని’ రిమార్క్ రాసి తన ఫిర్యాదు క్లోజ్ చేయడం చూసి షాక్ తిన్నాడు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసింది.