
Delhi Lockdown extended : దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే ఈ క్రమంలో కొత్త వ్యాక్సిన్లు, మందులకు కూడా అత్యవసర వినియోగం కోసం అనుమతులు ఇస్తోంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయినా కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్యకు అధికంగా ఉంటోంది. కేసుల తీవ్రతతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతగా ఏర్పడింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 32 శాతానికి పైగా కొనసాగుతోంది. మరోవైపు, ఆసుపత్రులలో బెడ్లు దొరికే పరిస్థితులు లేవు. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనికిముందు ఏప్రిల్ 19 రాత్రి 10 గంటల నుంచి ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఇది ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. తాజాగా లాక్‌డౌన్ పొడిగింపుపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఈరోజు తుది నిర్ణయం తీసుకుని, ప్రకటించనుంది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 24,103 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 357 మంది కరోనాతో కన్నుమూశారు.
Read Also… Corona Vaccine: మహిళలు పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..