అనంతపురం ‘కియా’ పరిశ్రమలో కరోనా కలకలం..!

ఏపీలోని కియా పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. పరిశ్రమలోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

అనంతపురం కియా పరిశ్రమలో కరోనా కలకలం..!

Edited By:

Updated on: Jun 04, 2020 | 5:35 PM

ఏపీలోని కియా పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. పరిశ్రమలోని బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. బాధితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అనంతపురం ఎస్కేయూ క్వారంటైన్‌కి అధికారులు తరలించారు. ఈ మేరకు కియా పరిశ్రమ ప్రతినిధులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు అతడు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే పరిశ్రమలో శానిటైజేషన్ పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే మరోవైపు రికవరీ రేటు కూడా భారీగా పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2వేలకు పైనే కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా మృతుల సంఖ్య 71కి చేరింది.

Read This Story Also: కరోనాను జయించిన మంత్రి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!