కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,818 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,926కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,34,811 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్టర వ్యాప్తంగా 81,276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్ నుంచే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బెంగళూరు అర్బన్‌లో 3,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,629 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. పలు చోట్ల మళ్లీ కర్ప్యూ విధిస్తున్నారు అధికారులు.
8818 new #COVID19 positive cases (including 3495 cases from Bengaluru Urban), 6629 discharges and 114 deaths reported in Karnataka today. Total number of cases now at 219926 including 81276 active cases, 134811 discharges and 114 deaths: State Health Department pic.twitter.com/VsQM67PasV
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా