కర్ణాటకలో రెండున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,642 కరోనా పాజిటివ్ కేసులు..

కర్ణాటకలో రెండున్నర లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

Updated on: Aug 19, 2020 | 10:45 PM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,642 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,49,590కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,64,150 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81,097 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 4,327 మంది మరణించారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌ నుంచే నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,804 కరోనా పాజిటివ్ కేసులు బెంగళూరు అర్బన్‌లోనే నమోదయ్యాయి.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Loading...
Unable to load recommendations.
Follow Us