‘నమస్తే’.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ పదవీ విరమణ

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు.

నమస్తే.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ పదవీ విరమణ

Edited By:

Updated on: Apr 30, 2020 | 8:01 PM

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి అయిన సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు. భారత సంప్రదాయ పద్దతిలో ఆయనకు నమస్తే చెప్పిన అక్బరుద్దీన్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1985 బ్యాచ్ కి చెందిన అక్బరుద్దీన్ 2016 జనవరిలో ఐరాస లో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. పాకిస్థాన్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐరాస ప్రకటించేలా చూడడంలో అక్బరుద్దీన్ కృషి చేశారు. అక్బరుద్దీన్ స్థానే విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తిరుమూర్తి ఐక్య రాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులు కానున్నారు.