కరోనా కోరలకు పదును.. 24 గంటల్లో 9,887 పాజిటివ్..

|

Jun 06, 2020 | 10:39 AM

గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,887 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒక్క రోజే 294 మంది మృత్యువాత పడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా కోరలకు పదును.. 24 గంటల్లో 9,887 పాజిటివ్..
Follow us on

కరోనా మహమ్మారి కోరలకు పదును పెరిగింది. మరింత వేగంగా విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసు‌లు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,887 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒక్క రోజే 294 మంది మృత్యువాత పడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,14,073 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,642 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 1,15,942 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య : 2,36,657

దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య : 1,15,942

దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం : 6,642

క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు : 1,14,073

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68,50,236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 3,98,224 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక కేసులు నమోదయిన దేశాల్లో భారత్‌ ఆరోస్థానంలో నిలిచింది.