National Corona Updates: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి. కాగా, తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 16,504 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒక్క రోజులో 214 మంది మృత్యువాత పడ్డారు. అలాగే గడిచిన 24 గంటల్లో 19,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,40,469 మంది కరోనా బారిన పడగా,1,49,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక 99,46,867 మంది బాధితులు కరోనాను జయించి సురక్షితంగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,43,953 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
Also read:
TDP Leader Arrest: టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు..
Drunk and Drive: మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు.. వారం రోజుల్లో3571 కేసులు నమోదు..