దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 52,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 803 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,746కి చేరుకుంది. ఇందులో 5,86,298 యాక్టివ్ కేసులు ఉండగా.. అటు 12,30,510 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా 38,135 మంది కరోనాతో మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఢిల్లీ తప్పితే మిగిలిన అన్నింటిలోనూ రోజుకు 5 వేలుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 4 August, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 1,855,745
▶️ Active cases: 586,298
▶️ Cured/Discharged/Migrated: 1,230,509
▶️ Deaths: 38,938#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/BKdzS6Fb6a
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 4, 2020
Read More: