India Coronavirus updates: భారత్‌లో నిన్న కరోనావైరస్ కేసులు పదివేలకు దిగువన నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం దేశవ్యాప్తంగా 11,067 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,58,371 కి చేరగా.. మరణాల సంఖ్య 1,55,252 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. నిన్న కరోనా నుంచి 13,087 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,61,608 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,41,511 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇప్పటివరకు దేశంలో 66,11,561 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.27 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,36,903 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 20,33,24,655 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.
Also Read: