India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్రర్.. కొత్తగా 2,34,692 కేసులు.. ప్రమాదకరంగా మరణాలు

|

Apr 17, 2021 | 10:57 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్రర్ సృష్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకరంగా పెరుగుతోంది. మరణాలు కూడా కలవరపెడుతున్నాయి.

India Corona Cases: దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్రర్.. కొత్తగా 2,34,692 కేసులు.. ప్రమాదకరంగా మరణాలు
Corona-Virus-India
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్రర్ సృష్టిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకరంగా పెరుగుతోంది. మరణాలు కూడా కలవరపెడుతున్నాయి. కొత్తగా దేశంలో 2,34,692 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. తాజాగా 1,341 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. తాజా మరణాలతో కలిపి దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,75,649 చేరింది. గడిచిన 24 గంటల్లో 1,23,354 వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220 కు చేరిందవి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైనే మృత్యువాతపడుతున్నారు.  మరణాల రేటు 1.22శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శుక్రవారం మొత్తం 30.04 లక్షల మందికి పైగా టీకాలు వేయగా.. మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 11,99,37,641కు చేరింది.

మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రమాదకర పరిస్థితులు

మహారాష్ట్రలో పరిస్థితి అదుపు తప్పినట్లు అర్థమవుతుంది. శుక్రవారం ఒక్కరోజే 61,695 కేసులు వెలుగు చూడగా.. 349 మంది వైరస్ కారణంగా మరణించారు.  ఇక ఢిల్లీలో 16,699 కేసులు నమోదు కాగా, 112 మంది చనిపోయారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మృతుల సంఖ్య పెరిగి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడటంతో.. ఆక్సిజన్‌ లభ్యతపై నిన్న ప్రధానమంత్రి మోదీ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని అధికారులను ఆదేశించారు.

Also Read: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు

డ్యాన్స్‌ ప్రాక్టీస్‌తో బిజీగా కుందనపు బొమ్మ సునీత.. ఫిమేల్ లీడ్‌గా సినిమాల్లోకి !