తొలిసారిగా సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారణ

| Edited By: Pardhasaradhi Peri

May 11, 2020 | 5:20 PM

పెండింగులో ఉన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం నుంచి విచారణ జరపనుంది. బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ట్రాన్స్ ఫర్ పిటిషన్లు తదితరాలను విచారించేందుకు అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరులో అత్యున్నత న్యాయస్థానం నిబంధనలను సవరించింది. పెరిగిపోతున్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల బెంచ్ ఈ విధమైన పిటిషన్లను విచారిస్తుంది. కానీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న పిటిషన్ల పరిష్కారానికి ఈ లాక్ డౌన్ కాలంలో సింగిల్ […]

తొలిసారిగా సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారణ
Follow us on

పెండింగులో ఉన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం నుంచి విచారణ జరపనుంది. బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ట్రాన్స్ ఫర్ పిటిషన్లు తదితరాలను విచారించేందుకు అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరులో అత్యున్నత న్యాయస్థానం నిబంధనలను సవరించింది. పెరిగిపోతున్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల బెంచ్ ఈ విధమైన పిటిషన్లను విచారిస్తుంది. కానీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న పిటిషన్ల పరిష్కారానికి ఈ లాక్ డౌన్ కాలంలో సింగిల్ జడ్జ్ బెంచ్ ఏర్పాటు సబబని భావించారు. ఏడేళ్ల లోపు జైలు శిక్షల విధింపునకు సంబంధించిన కేసులు, అపీళ్లను సైతం ఈ బెంచ్ విచారిస్తుంది. గత ఏడాది జులై వరకు కోర్టులో 11.5 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది. ఈ కరోనా లాక్ డౌన్ తరుణంలో మరీ అత్యవసరమైన కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో,స్కైప్ ద్వారానో విచారిస్తున్నారు. ఏమైనా.. ఒక అత్యున్నత న్యాయ స్థానంలో సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ అన్నది ఇదే మొదటిసారి.