కరోనా పరీక్షలు ఎవరెవరికి చేయాలంటే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

| Edited By:

May 18, 2020 | 7:36 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

కరోనా పరీక్షలు ఎవరెవరికి చేయాలంటే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

1.గత 14 రోజుల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి
2.కరోనా వచ్చిన వారితో కాంటాక్ట్ ఉన్నవారికి
3.కరోనా వైద్యం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్‌ వర్కర్లులకు
4.తీవ్ర శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారికి
5.కరోనా బాధితులకు అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి 5, 10వ రోజున
6.హాట్‌స్పాట్‌లు, కంటైన్‌మెంట్ జోన్లలో తీవ్ర అస్వస్థతకు గురైన వారికి
7.అనారోగ్యం బారిన పడిన వలస కూలీలకు ఏడు రోజుల్లోగా పరీక్షలు చేయాలి.

ఇక కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని హెచ్చరించింది. కాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 96,169కు చేరింది. ఇందులో 3,029 మంది కరోనాతో చనిపోగా.. 36,824 మంది కోలుకున్నారు.

Read This Story Also: ఏ ప్రాజెక్ట్ అయినా పవన్‌ సినిమా తరువాతే..!