టీ-20 వరల్డ్‌కప్‌ వాయిదా పడినట్టే! నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన

| Edited By:

Oct 18, 2020 | 7:19 PM

ఇప్పుడున్న పరిస్థితులలో టోర్నమెంట్‌ను నిర్వహించడం అసాధ్యం.. కరోనా వైరస్‌ అక్కడ కాలనాగులా బుసలు కొడుతోంది

టీ-20 వరల్డ్‌కప్‌ వాయిదా పడినట్టే! నాలుగైదు రోజుల్లో అధికారిక  ప్రకటన
Follow us on

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ-20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసుకోవడం మినహా ఐసీసీకి మరో దారి లేదు.. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఈ ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో టోర్నమెంట్‌ను నిర్వహించడం అసాధ్యం.. కరోనా వైరస్‌ అక్కడ కాలనాగులా బుసలు కొడుతోంది.. ఫైనల్‌ మ్యాచ్‌ సహా కొన్ని లీగ్‌ మ్యాచ్‌లు జరిగే మెల్‌బోర్న్‌లో పరిస్థితి దారుణంగా ఉంది..

ఇలాంటి సమయంలో అక్కడ వరల్డ్‌కప్‌ను నిర్వహించాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది.. పైగా ఇంగ్లాండ్‌తో లిమిటెడ్‌ ఓవర్ల సిరీస్‌ కోసం రెడీ అవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు కబురు అందిందట! దీని అర్థం ప్రపంచకప్‌ వాయిదా పడినట్టే కదా అన్నది కొందరి అభిప్రాయం.. లాజిస్టిక్‌ ప్రాబ్లమ్స్‌ కారణంగా పొట్టి క్రికెట్‌ టోర్నీని వాయిదా వేయాలని ఐసీసీ గట్టిగా అనుకుంటోంది.. నాలుగైదు రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా చేయవచ్చు. ఇంగ్లాండ్‌తో లిమిటెడ్‌ ఓవర్‌ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నవాళ్లు నేరుగా ఇండియాకు బయలుదేరుతారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి..

ఇక కరోనా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఆటలాడుకుంటోంది.. ఆ వైరస్‌ను ఎలా కట్టడి చేయాలో తెలియక రెండు రాష్ట్రాల సరిహద్దులను క్లోజ్‌ చేసింది ప్రభుత్వం. 1918-19లో స్పానిష్‌ ఫ్లూ విజృంభిస్తున్న సమయంలో ఇలా న్యూ సౌత్‌ వేల్స్‌ బోర్డర్స్‌ను మూసేశారు.. మళ్లీ సరిహద్దులు మూతబడింది ఇప్పుడే! ఇప్పుడక్కడ కంప్లీట్‌ లాక్‌డౌన్‌ నడుస్తోంది.. పరిస్థితులు చూస్తుంటే అక్టోబర్‌ నాటికి కరోనా కంట్రోల్‌ అవుతుందన్న నమ్మకం కలగడం లేదు. అంటే ఏ రకంగా చూసినా టీ -20 వలర్డ్‌కప్‌ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి..