
లాక్‌డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయిన విషయం తెలిసిందే. అందులోనూ విదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. ఈ మధ్యనే కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా దేశంలో విమాన సర్వీసులు నడుస్తున్నా.. అంతర్జాతీయంగా మాత్రం విమానాలు ఇప్పట్లో తిరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈక్రమంలోనే విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ చేపట్టింది. పలు దేశాలకు ప్రత్యేక ఎయిర్ లైన్స్ ద్వారా ఇండియన్స్‌ని తీసుకొస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వారంతా ఇప్పుడిప్పుడే భారత్‌కు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే లాక్‌డౌన్ కారణంగా దాదాపు 100 రోజుల పాటు టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్యా విరానికా, ఆయన పిల్లలు సింగపూర్‌లోనే ఉండిపోయారు. అయితే కేంద్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వందే భారత్ మిషన్’ ద్వారా వారు స్వదేశానికి వస్తున్నారు. ఈ విషయాన్ని విష్ణు భార్య విరానికా ట్వీట్ ద్వారా తెలిపారు. ఫ్లైట్‌లో సురక్షిత మాస్కులు ధరించి కూతుళ్లతో దిగిన ఫొటోలను షేర్ చేసింది విరానికా. వంద రోజుల తర్వాత సింగపూర్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. మాకు సహకరించిన వందే భారత్ మిషన్, ఎయిర్ ఇండియా, సింగపూర్ బృందానికి థాంక్స్.. అంటూ ట్వీట్‌లో పేర్కొంది ఆమె. కాగా ఆ ట్వీట్‌ను మంచు విష్ణు రీట్వీట్ చేశారు.