కరోనా విజృంభణ… హెల్త్‌వర్కర్లకు పాజిటివ్

|

May 28, 2020 | 4:13 PM

దేశ రాజాధాని ఢిల్లీలో కరోనా మహమ్మరి విరుచుకుపడుతోంది. వైరస్‌ కట్టడిలో ముందు వరసలో నిలబడి పోరాటం చేస్తున్న డాక్టర్లను…హెల్త్‌వర్కర్లను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న 195 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు నెలల్లో ఈ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు. 195 మందిలో ఇద్దరు ఫ్యాకల్టీ లెక్చరర్స్‌, ఐదుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, 21 మంది నర్సులు, ఎనిమిది మంది టెక్నిషీయన్లు, 32 మంది […]

కరోనా విజృంభణ... హెల్త్‌వర్కర్లకు పాజిటివ్
Follow us on

దేశ రాజాధాని ఢిల్లీలో కరోనా మహమ్మరి విరుచుకుపడుతోంది. వైరస్‌ కట్టడిలో ముందు వరసలో నిలబడి పోరాటం చేస్తున్న డాక్టర్లను…హెల్త్‌వర్కర్లను కూడా వదలడం లేదు. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న 195 మంది హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు నెలల్లో ఈ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు.

195 మందిలో ఇద్దరు ఫ్యాకల్టీ లెక్చరర్స్‌, ఐదుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, 21 మంది నర్సులు, ఎనిమిది మంది టెక్నిషీయన్లు, 32 మంది శానిటేషన్‌ వర్కర్క్‌తో పాటు 68 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా సోకినట్లు తెలిపారు. గత రెండు రోజుల్లోనే అత్యధికంగా 50 మందికి పాజిటివ్‌‌గా గుర్తించామన్నారు.