Google Vaccination: లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్స్‌… వ్యాక్సినే చేసుకుంటే ఇవేవీ ఉండవు. గూగుల్‌ వీడియో.

|

Apr 06, 2021 | 11:46 AM

Google Vaccination: కరోనా మహమ్మారి ఎంతటి గందరగోళం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది విశ్వరూపం చూపించిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజాను విసురుతోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి...

Google Vaccination: లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్స్‌... వ్యాక్సినే చేసుకుంటే ఇవేవీ ఉండవు. గూగుల్‌ వీడియో.
Google Vaccination
Follow us on

Google Vaccination: కరోనా మహమ్మారి ఎంతటి గందరగోళం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది విశ్వరూపం చూపించిన కరోనా ఇప్పుడు మళ్లీ తన పంజాను విసురుతోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇక కరోనా ఎన్నో మార్పులకు కారణమైంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సంతోషాలు, సినిమాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా చాలా దూరమయ్యాయి. లాక్‌డౌన్‌, క్వారంటైన్‌, సోషల్‌ డిస్టెన్స్‌ వంటి కొత్త పదాలు నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్‌. కానీ చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జనాలు ఇప్పటికీ వ్యాక్సిన్‌పై అనుమాన పడుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే ఏమవుతోందో అనే భయంతో చాలా మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్నారు. సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పెడుతూ.. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రావడం లేదు. దీంతో గూగుల్‌ వ్యాక్సినేషన్‌పై వినూత్న ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో కరోనా వల్ల మనం కోల్పోయిన సంతోషాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ వీడియో ద్వారా మనం ప్రేమించిన వాటిని తిరిగి పొందాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవాలనే మంచి సందేశాన్ని ఇచ్చింది గూగుల్‌. ఆలోజింప చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

గూగుల్ రూపొందించిన వీడియో..

 

Also Read: Corona Cases India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. మరోసారి 90 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.!

Coronavirus: తెలంగాణలో స్పీడు పెంచిన కరోనా వైరస్‌.. గడిచిన 24 గంటల్లో ఎన్ని పాజిటివ్‌ కేసులంటే..!

Corona: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?