జీహెచ్‌ఎంసీ మేయర్ డ్రైవర్‌కు కరోనా.. హోం క్వారంటైన్‌లో మేయర్ కుటుంబం..

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వుడం కలకలం రేపుతోంది.

జీహెచ్‌ఎంసీ మేయర్ డ్రైవర్‌కు కరోనా.. హోం క్వారంటైన్‌లో మేయర్ కుటుంబం..

Edited By:

Updated on: Jun 11, 2020 | 8:15 PM

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వుడం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా సోకడంతో.. అంతా వణికిపోతున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ బొంతు రామ్మోహన్‌ డ్రైవర్‌కు కూడా కరోనా సోకింది. కరోనా లక్షణాలు ఉండటంతో.. అతడికి పరీక్షలు చేయగా.. అతడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే సదరు బాధిత డ్రైవర్‌ ఉదయం నుంచి డ్యూటీలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో మేయర్ కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మేయర్‌తో సహా ఆయన కుటుంబానికి శుక్రవారం వైద్యులు కరోనా పరీక్షలు చేయనున్నారు. ఇక సదరు డ్రైవర్‌ ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.